, విశాఖపట్టణం : రుషికొండ బీచ్‌లో ప్రమాదవశాత్తు మునిగిపోతున్న ఓ యువకుడిని అక్కడే ఉన్న లైఫ్‌గార్డులు రక్షించారు. అనంతరం అరిలోవ బీచ్ మొబైల్ వాహనం ద్వారా యువకుడిని గీతం ఆసుపత్రికి తరలించారు. యువకుడిని విజయనగరం జిల్లా కొత్త అగ్రహారానికి చెందిన జల్లెపల్లి జగదీష్‌గా గుర్తించారు. కాగా, బాధితుడు జగదీష్ సహా 25 మంది మెడికల్ దుకాణాల సిబ్బంది సరదాగా ఎంజాయ్ చేద్దామని మంగళవారం బీచ్‌కు రాగా, ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగింది. బాధితుడిన రక్షించిన వారిలో పోలీస్ కానిస్టేబుళ్లు వాసు, మధు లైఫ్‌గార్డులు అప్పన్న, రమేశ్, రాజేశ్, రాజ్‌కుమార్ బివిజి గార్డులు దుర్గ, ఎల్లాజిలు ఉన్నారు.
బీచ్‌లో యువకుడిని రక్షించిన లైఫ్‌గార్డులు