యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా ఎవరు నటిస్తారనేది రేపు( నవంబర్ 20) రివీల్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాకుండా ప్రతినాయక పాత్రల గురించి కూడా రేపే చెబుతామని వెల్లడించింది. సినిమా షూటింగ్ దాదాపుగా 70శాతం పూర్తిచేసినట్టుగా యూనిట్ పేర్కొంది.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. రామ్‌చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమరం భీంగా నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుంది.